జనగామ జిల్లా అభివృద్ధి కోసం... అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన.. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అలాగే నిర్ణీత ఫార్మాట్లలో అత్యధిక నిధులు రాబట్టడానికి వీలుగా ఇకనుంచి కేంద్రానికి ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలన్నారు. కేంద్రం సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరింత తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: ఎర్రబెల్లి - దిశ సమావేశం
కేంద్ర నిధులు మరిన్నిరాబట్టడం ద్వారా జనగామ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీలు, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొన్నారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి
ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ నిఖిల, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి