తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి కోసం కూతురి నిరాహార దీక్ష - bhagyalashkimi

కన్న కూతురు ఇంటికొస్తే నువ్వెవరో నాకు తెలియదంటోంది ఓ తల్లి. నాకూ నీకూ ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెబుతోంది. కానీ ఆ కూతురు మాత్రం తల్లి కోసం నిరాహార దీక్షకు దిగింది.

తల్లి కోసం కూతురి నిరాహార దీక్ష

By

Published : Sep 20, 2019, 5:21 PM IST

Updated : Sep 20, 2019, 10:32 PM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల అంబేడ్కర్​నగర్​లో ఉంటున్న భాగ్యలక్ష్మీ కూతురు గ్రీష్మిక చిన్నతనంలోనే ఆమె గుండెపోటుతో తండ్రి చనిపోయాడు. అప్పుడు భాగ్యలక్ష్మీ టీచర్​ ట్రైనింగ్​ కోసం వెళ్లింది. ఒక నెల పసిపాపగా ఉన్న గ్రీష్మిక... ఇన్నాళ్లు పెద్దనాన్న వద్ద పెరిగింది. ప్రస్తుతం తల్లి భాగ్యలక్ష్మీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం తల్లి వద్దకు రాగా... దగ్గరకు తీసుకొని బాగానే చూసుకుంది.

ప్రస్తుతం ఇంటర్​ మొదటి సంవత్సరం చదువుకున్న గ్రీష్మికను తల్లికి అప్పగించేందుకు పెదనాన్న తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో... నువ్వెవరో నాకు తెలీదు. నా కూతురు కాదు నువ్వు అని తిరస్కరించింది భాగ్యలక్ష్మీ. నాకు నాకన్న తల్లి కావాలంటూ... గ్రీష్మిక కులపెద్దలను, పోలీసులను ఆశ్రయించింది. కానీ భాగ్యలక్ష్మీ నాకు సంబంధం లేదని తెగేసి చెప్పింది. నాకు న్యాయం కావాలని, నిరాహార దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించి, దీక్ష భగ్నం చేశారు.

తల్లి కోసం కూతురి నిరాహార దీక్ష

ఇదీ చూడండి: 400 జిల్లాల్లో రుణదాతలతో బ్యాంకుల భేటీ

Last Updated : Sep 20, 2019, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details