జనగామ జిల్లాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగిపోతోంది. వరుసగా 2 రోజుల నుంచి 20 పైగా కేసులు నమోదు అవుతున్నాయి. 29వ తేదీన 23 కేసులు నమోదు కాగా... 30 వ తేదీన 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం వల్ల ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు.
సబ్ జైల్లో ఉన్న నలుగురు ఖైదీలకు కరోనా
జనగామ జిల్లా కేంద్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పట్టణంలోని సబ్ జైల్లో నలుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా సోకినట్లు జైలు అధికారులు తెలిపారు. అలాగే గత రెండ్రోజుల నుంచి ప్రతి రోజూ 20 కేసులు నమోదవుతున్నాయి.
సబ్ జైల్లో ఉన్న నలుగురు ఖైదీలకు కరోనా
అత్యవసరం అయితే బయటకు రావడానికి పట్టణవాసులు ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ... మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో నలుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. వారిని జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
TAGGED:
corona cases in janagaon