ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం నుంచి పాలనాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకులు సంయుక్త కలెక్టర్ మధుకు వినతిపత్రం సమర్పించారు.
ఇంటర్ ఫలితాలపై జనగామలో కాంగ్రెస్ నిరసన
ఇంటర్ ఫలితాల్లో విద్యాశాఖ అధికారుల వైఫల్యానికి నిరసనగా జనగామలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేశారు. పట్టణంలో ర్యాలీ తీసి సంయుక్త కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
అవకతవకలకు పాల్పడిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటికో ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఇవీ చూడండి : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో స్పల్ప అగ్ని ప్రమాదం