రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం బలవన్మరణానికి పాల్పడిన కార్మికులకు నివాళులు అర్పించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్టీసీకి ఎక్కువ నష్టాలు వచ్చాయని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు: పొన్నాల లక్ష్మయ్య - పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. జనగామ జిల్లాలో నిర్వహించిన ఆర్టీసీ సమ్మెలో ఆయన పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు: పొన్నాల లక్ష్మయ్య