తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు - Clash between trs bjp in jangaon

trs
trs

By

Published : Feb 9, 2022, 12:31 PM IST

Updated : Feb 9, 2022, 2:10 PM IST

12:30 February 09

తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు

తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు

Clash between TRS and BJP: ఆంధ్రప్రదేశ్​ విభజనపై పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది.

ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపైఒకరు దాడి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన భాజపా, తెరాస కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Last Updated : Feb 9, 2022, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details