తెలంగాణ

telangana

ETV Bharat / state

KISHAN REDDY: 'హుజూరాబాద్​లో తెరాస రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తోంది' - telangana varthalu

హుజూరాబాద్​లో తెరాస పార్టీ రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆరోపించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా జనగామకు చేరుకున్న కేంద్రమంత్రికి భాజపా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు

KISHAN REDDY: 'హుజూరాబాద్​లో తెరాస రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తోంది'
KISHAN REDDY: 'హుజూరాబాద్​లో తెరాస రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తోంది'

By

Published : Aug 20, 2021, 11:33 PM IST

తెరాసలో ఆత్మగౌరవంతో వ్యవహరిస్తే ఈటల రాజేందర్​ లాగా వారిని కూడా బయటికి పంపిస్తారని.. ఆ పార్టీలో ఉండాలంటే కేసీఆర్​ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా మాత్రమే ఉండాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఎద్దేవా చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా జనగామకు చేరుకున్న కేంద్రమంత్రికి భాజపా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో 12లక్షల కోట్ల అవినీతి జరిగిందని కిషన్​ రెడ్డి ఆరోపించారు. బలగాలపై దాడిచేసిన ఉగ్రవాదులను వారి ప్రాంతాలకే వెళ్లి వారిని హతమార్చి పగతీర్చుకున్నామని గుర్తు చేశారు. ఏడేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధానమంత్రి పనిచేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కొనియాడారు. హుజూరాబాద్​లో తెరాస పార్టీ రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్లని, ప్రజలే న్యాయనిర్ణేతలని ఆయన అన్నారు. ఎవరు ఎమ్మెల్యేగా, ఎంపీగా, సర్పంచ్​గా, వార్డ్​ మెంబర్​గా ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ ఉద్యమంలో 12వందల మంది బలిదానాలు చేసుకున్నారని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నియామకాలు జరగడం లేదని విమర్శించారు.

తెలంగాణలో కేసీఆర్​ కుటుంబ పాలన నడుస్తోందన్నారు. గులాబీ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకుంటోందని ఆరోపించారు. ఏడేళ్ల పాలనలో డబుల్​బెడ్​రూం ఇళ్లపేరుతో కాలయాపన చేస్తున్నారని... ఇప్పటివరకు లక్ష ఇళ్లను కూడా నిర్మించలేదన్నారు. కేసీఆర్​ పాలనలో ఇల్లు అనేది అందని ద్రాక్షలా తయారయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: Kishan Reddy: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే.. మొదటి అడుగు హుజూరాబాద్​లోనే'

ABOUT THE AUTHOR

...view details