జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారంలో నూతనంగా 11 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ అర్జుల రమాదేవి, గ్రామస్థుల సహకారంతో స్వచ్ఛందగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంపై డీసీపీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నిఘా నేత్రాలతో గ్రామంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయని.. స్థానికులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.
జనగామలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీసీపీ - డీసీపీ శ్రీనివాస్ రెడ్డి
జనగామ జిల్లా అబ్దుల్ నాగారంలో సీసీ కెమెరాలను డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్, స్థానికుల సహకారంతో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.
జనగామలో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీసీపీ