'రక్తదానం ప్రాణదానంతో సమానం' - జనగామ
జనగామ పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. రక్తం దానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని వరంగల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
'రక్తదానం ప్రాణదానంతో సమానం'
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రక్తదాన శిబిరాన్ని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఏసీపీ వెంకటేశ్వర్ బాబు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం ప్రాణంతో సమానమని డీసీపీ అన్నారు. రోడ్డు ప్రమాదాలతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని రక్షించేందుకు రక్త దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ కేసి జాన్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.