జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండ గ్రామంలో సోమవారం కిసాన్ మహిళా ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా మామిడికాయల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వానాకాలంలో రైతులు సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా లాభదాయకమైన పంటలు వేసి లబ్ధి పొందాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.
మామిడికాయల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం లాక్డౌన్ సమయంలోనూ వరి, మొక్కజొన్నలతోపాటు మామిడి కాయలను ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోందని స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య తెలిపారు.
రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు అందించి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. రానున్న వానాకాలంలో నూతన సమగ్ర వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతులకు నూతన సమగ్ర వ్యవసాయ విధానంపై అధికారులే అవగాహన కల్పించాలని సూచించారు. మామిడి కాయల రేటు ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని వేసవికాలంలో మామిడి తోటకు కష్టాలు ఎక్కువగా ఉంటాయని... గాలి దుమారం వలన కాయలు, పిందెలు రాలి రైతులు ఎక్కువగా నష్టపోయారని తెలిపారు.
ఇవీ చూడండి:గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?