తెలంగాణ

telangana

ETV Bharat / state

వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి చేరుకున్న బండి పాదయాత్ర - బండి సంజయ్ పాదయాత్ర అప్‌డేట్‌

Bandi Sanjay Padayatra Completed 1000 kilometers భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మరో మైలురాయి చేరుకుంది. యాదాద్రిలో ప్రారంభించిన ఈ మూడో విడత యాత్ర ఇవాళ్టితో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లా అప్పిరెడ్డిపలె వద్దకు చేరడంతో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ గ్రామంలో బండి సంజయ్ పైలాన్ ఆవిష్కరించారు. డప్పు చప్పుళ్లు, బాణాసంచాతో కాషాయ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

Bandi Sanjay Padayatra Completed 1000 kilometers
Bandi Sanjay Padayatra Completed 1000 kilometers

By

Published : Aug 17, 2022, 1:42 PM IST

Bandi Sanjay Padayatra Completed 1000 kilometers : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. యాదాద్రిలో ప్రారంభమైన ఈ యాత్ర జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లె వద్దకు చేరడంతో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయికి చిహ్నంగా బండి సంజయ్ పాలకుర్తి మండలం అప్పిరెడ్డిపల్లె వద్ద పైలాన్ ఆవిష్కరించారు. బెలూన్లు, బాణాసంచా, డప్పు వాద్యాలతో భాజపా శ్రేణులు సందడి చేశారు. చీటూర్, కిష్టగూడెం మీదుగా కుందారం వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగింది.

ఈ యాత్ర మొదటి నుంచి బండి సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వచ్చారు. తెరాస వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను ఊరూరా వివరించారు. ఒక దశలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు పరిధులు దాటాయని భావించిన తెరాస నాయకులు భాజపాపై విరుచుకుపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దేవరుప్పులలో కాషాయ శ్రేణులపై తెరాస నేతలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కొందరు భాజపా నేతలు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ఈ ఘటనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఖండించారు. తాము మొదటి నుంచి చెబుతున్నంటే తెరాస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పోలీసులు కూడా రౌడీల్లో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు రక్షణ ఉండి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన పోలీసులు గొడవ జరుగుతోంటే మిన్నకుండి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు యాదాద్రిలో ప్రారంభించిన ఈ యాత్రలో బండి సంజయ్ ఊరూరా తిరుగుతూ తెరాస పాలనను ఎండగట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పనితీరును విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రాష్ట్ర ఆరోగ్య రంగం పనితీరుపై విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details