జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శ్రీ పతిపల్లి గ్రామ శివారు హనుమాన్ ఆలయంలో సరస్వతి యజ్ఞం ఘనంగా నిర్వహించారు. సరస్వతి సేవ సమితి ఆధ్వర్యంలో 404వ సరస్వతి యజ్ఞం చేపట్టారు. 19వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ప్రారంభమైన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది. ఉడుత వేణుగుప్తా కుటుంబ సభ్యులు నిర్వహించిన యాగంలో సరస్వతి సమితి సభ్యులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరస్వతి సేవా సమితి తలపెట్టిన 404వ యజ్ఞం హనుమాన్ ఆశీస్సులతో విజయవంతంగా పూర్తైందని యజ్ఞకర్త అనంతసాగర్ సరస్వతి క్షేత్ర పీఠాధిపతి అష్టకాల నర్సింహ శర్మ తెలిపారు.
హనుమాన్ ఆశీస్సులతో 404వ సరస్వతి యజ్ఞం విజయవంతం - HANUMAN TEMPLE
జనగామ జిల్లాలో సరస్వతి సేవా సమితి తలపెట్టిన 404వ యజ్ఞం హనుమాన్ ఆశీస్సులతో విజయవంతంగా పూర్తైందని అనంతసాగర్ సరస్వతి క్షేత్ర పీఠాధిపతి అష్టకాల నర్సింహ శర్మ తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రారంభమైన యజ్ఞం పూర్ణాహుతితో ముగిసింది.
సరస్వతి సేవా సమితి 404వ యజ్ఞం