జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బలవన్మరణానికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్లకు నివాళులు అర్పించారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి' - జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'