జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఇటీవలే ముంబయి నుంచి స్వగ్రామానికి వచ్చిన వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి కరోనా నిర్ధరణ కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈలోగా వృద్ధ దంపతులకు పాజిటివ్‌గా వైద్య పరీక్షల్లో తేలింది.
స్వచ్ఛంద లాక్డౌన్లో నాచుపల్లి గ్రామం
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
స్వచ్ఛంద లాక్డౌన్లో నాచుపల్లి
సదరు వృద్ధ దంపతుల ఇంట్లో పాల వ్యాపారం నిర్వహించడం వల్ల కొనుగోలుదారులకు హోం క్వారంటైన్ విధించారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటించేందుకు గ్రామస్థులు నిర్ణయించారు. అత్యవసర సేవలు మినహా మిగతా దుకాణాలు మూసివేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేందుకు నిర్ణయించారు. మాస్కు విధిగా ధరించాలని గ్రామ పెద్దలు చాటింపు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు