జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని గోల్ హనుమాన్ వినాయక మండపం నిర్వాహకులు వినూత్నంగా గణేశ నిమజ్జనం చేశారు. పట్టణ శివారులో నిమజ్జనానికి ఏర్పాటు చేసినా.. అక్కడ సరిగా నీళ్లు లేవని గుర్తించిన నిర్వహకులు కొత్తగా ఆలోచించారు. అందరిలా నీళ్లు పోసి కాకుండా పాలు పోసి నిమజ్జనం చేయాలనుకున్నారు. గణపతిని ప్రతిష్టించిన చోటే పాలతో నిమజ్జనం చేశారు. సుమారు గంటన్నరపాటు వినాయకునిపై పాలు పోసి... అనంతరం నీరు పోసి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. ఈ నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పాలతో వినాయక నిమజ్జనం..తరలొచ్చిన భక్తజనం..
సాధారణంగా వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు... లేక ఉన్న చోటే నీటితో తడిపి నిమజ్జనం చేస్తారు. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పాలతో నిమజ్జనం చేశారు. అవును మీరు విన్నది నిజమే గణనాథుడి విగ్రహంపై పాలు పోసి నిమజ్జనం చేశారు.
పాలతో వినాయక నిమజ్జనం