క్వింటాలు పసుపు వివో మద్దతు ధర 15,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలో పసుపు రైతులు కదం తొక్కారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు మెట్ పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి జాతీయ రహదారిపై పాత బస్టాండ్ వరకు బైఠాయించి ధర్నా నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు.తర్వాత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల గోస మాత్రం తీరట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'పసుపు క్వింటాలుకు మద్దత ధర రూ.15000 ఇప్పించాలి' - 'పసుపు క్వింటాలుకు మద్దత ధర రూ.15000 ఇప్పించాలి'
తమకు రూ.15000 మద్దతు ధర ఇవ్వాలని పసుపు రైతులు జగిత్యాల జిల్లాలో ఆందోళన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసుకుని మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు.
వెంటనే మద్దతు ధర ప్రకటించాలి : పసుపు రైతులు
పసుపు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని.. కనీసం పెట్టుబడులు కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నామని ఆందోళన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని కనీసం 15 వేల రూపాయల మద్దతు ధర అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తోన్న రైతులను సముదాయించి ఆందోళన విరమింప చేశారు.