తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపే బంగారమాయెనే... మార్కెట్​లో రికార్డు ధరలు

పసుపు రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. పసుపు ధరలు పెరగడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పోటీ పడుతూ ధరలు పెరుగుతుండడం వల్ల రైతులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు.

పసుపే బంగారమాయెనే... మార్కెట్​లో రికార్డు ధరలు
పసుపే బంగారమాయెనే... మార్కెట్​లో రికార్డు ధరలు

By

Published : Feb 12, 2021, 8:49 PM IST

పసుపు ధరలు పెరగడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కాడి రకం పసుపు క్వింటాకు రూ.7,666, గోళ రకానికి 6,751, చూర రకానికి 5,501 ధర పలికింది. గత కొన్నేళ్లుగా కనీస ధరలు లభించక దిగాలు పడిన పసుపు రైతులకు ఈ ఏడు బంగారంగా మారింది. వారం రోజులుగా అన్ని వ్యవసాయ మార్కెట్లలోను పసుపు పంటకు రికార్డు ధరలు లభించడం రైతులకు ఊరటనిస్తోంది.

నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్​తో పోటీ పడుతూ ధరలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అందరి చూపు మెట్​పల్లి మార్కెట్​వైపు పడింది. భవిష్యత్తులో ధరలు మరింత పెరగొచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. దళారులను నమ్మి మోసపోకుండా వ్యవసాయ మార్కెట్​కు తీసుకొచ్చి లాభాలు ఆర్జించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:నేను ఎవర్ని.. నేనేం చేస్తాను.. విద్యార్థులతో హరీశ్​ మమేకం

ABOUT THE AUTHOR

...view details