తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరుగుతున్న పసుపు ధరలు.. రైతుల మోముల్లో చిరునవ్వులు

ఈ ఏడాది పసుపు ధరలు రైతుల కళ్లలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగతుండగా మార్కెట్​లో క్వింటాలుకు గరిష్ఠంగా రూ.8889 పలికింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో జరుగుతున్న కొనుగోళ్లతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

turmeic rates hiked dialy in markets farmers happy with tthis prices in metpally market in jagtial district
మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో పసుపు కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు

By

Published : Mar 2, 2021, 9:53 PM IST

Updated : Mar 3, 2021, 8:50 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో పసుపు క్వింటాలు ధర గరిష్ఠంగా రూ.8889 పలకడం రైతుల మోముల్లో చిరునవ్వులు కురిపిస్తోంది. ఈ ఏడాది పసుపు ధరలు రోజు రోజుకు ఎగబాకడం రైతులకు సంతోషాన్ని కలిగిస్తోంది. వ్యవసాయ మార్కెట్​లో ఈనామ్​ ద్వారా వ్యాపారులు పసుపును కొనుగోలు చేస్తున్నారు.

ఈ విధానంలో కాడిరకం 10089, గోల రకం 3943, చూర రకం 836 క్వింటాళ్ల పసుపును కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు మంచి పసుపును తీసుకొస్తే అనుకున్న ధర లభిస్తుందని రైతులకు సూచించారు. మార్కెట్​లో పసుపు ధరలు పెరగడం రైతులు కళ్లలో సంతోషం కనిపిస్తోంది.

ఇదీ చూడండి :రాష్ట్ర సర్వర్ల హ్యాకింగ్​కు చైనా యత్నం : ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ

Last Updated : Mar 3, 2021, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details