జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలం రాజారాంపల్లెలో ట్రైనీ ఐఏఎస్‌లు పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల పనితీరును పరిశీలించారు.
జిల్లాలో పర్యటించిన ట్రైనీ ఐఏఎస్‌లు
జగిత్యాల జిల్లా రాజారాంపల్లె గ్రామంలో ట్రైనీ ఐఏఎస్‌లు పర్యటించారు. వివిధ శాఖల ఉద్యోగుల పని తీరు, నిర్వహణ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు గ్రామంలో ఉండి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించనున్నారు.
వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు వారం రోజుల పాటు గ్రామంలో ఉండి పాలనాపరమైన అంశాల గురించి తెలుసుకోనున్నారు. రెండు రోజులుగా నీటి పారుదల శాఖ, అంగన్వాడీ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య అధికారులు, సిబ్బందితో కలిసి వారు చేస్తున్న పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైనీ అధికారులు వారి కుటుంబ నేపథ్యం, సివిల్స్ సాధించిన తీరును గురించి వివరించారు.
ఇదీ చదవండి:డీజీపీ కార్యాలయం ముట్టడి.. భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్