జగిత్యాలలో ట్రాఫిక్‌పై వినూత్నఅవగాహన కార్యక్రమం
ట్రాఫిక్‌పై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నాటిక రూపంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
traffic awareness in jagitial district
జగిత్యాల జిల్లాలో ట్రాఫిక్‌పై ప్రజలకు నాటిక రూపంలో అవగాహన కల్పించారు. డీఎస్పీ వెంకటమరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో యమధర్మరాజు పాశం విసిరే విధానం కళ్లకు కట్టినట్లు చూపించారు. శిరస్త్రాణం ధరించిన యువకుడు సైతం ప్రమాదానికి గురికాగా... అతనికి యమధర్మరాజు పాశం వేసినా.. ప్రాణం తీయలేని స్థితిని వివరించిన తీరు వాహనదారులను ఆకట్టుకుంది.
- ఇదీ చూడండి : ఆపరేషన్ విజయ్: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు
TAGGED:
cordon