తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో ఘనంగా మహిళా దినోత్సవాలు - జిల్లా కలెక్టర్​ గుగులోతు రవి

జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలు చూపరులను ఆకట్టుకున్నాయి. పలు రంగాల్లో ప్రతిభ కనపరిచిన పలువురు మహిళామణులను జిల్లా కలెక్టర్​ గుగులోతు రవి సత్కరించారు.

The collector who honored youtuber Gangavva with the occasion of women's day celebrations in jagityala
జగిత్యాలలో ఘనంగా మహిళా దినోత్సవాలు

By

Published : Mar 8, 2020, 9:49 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయం నుంచి మహిళా ఉద్యోగులు ర్యాలీగా స్థానిక వీకేబీ కల్యాణ మండపం వరకు వెళ్లారు.

అనంతరం నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో యూట్యూబర్​ గంగవ్వ, సరితలను జిల్లా పాలనాధికారి రవి సత్కరించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి పేర్కొన్నారు.

జగిత్యాలలో ఘనంగా మహిళా దినోత్సవాలు

ఇవీచూడండి:"నాన్న కూతురిగా కాదు.. తమిళిసైగా ఎదగాలనుకున్నాను"

ABOUT THE AUTHOR

...view details