జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (టెల్సా) ఆధ్వర్యంలో సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలకు చెందిన బోగ శివప్రసాద్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల దూరప్రాంతాల నుంచి వస్తున్న సమస్యను మెయిల్ ద్వారా సొసైటీకి తెలిపారు. స్పందించిన సొసైటీ.. విద్యార్థులకు సైకిళ్లను పంపించగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అందించారు. టెల్సా సొసైటీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. సైకిళ్ల పంపిణీపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
టెల్సా దాతృత్వం..పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ - tesla given cycles for govt school children jin jagithyal dist
దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునేందుకు విద్యార్థులకు ఇబ్బంది అవుతోందని గ్రహించాడు ఆ ఉపాధ్యాయుడు. వెంటనే మదిలో మెదిలిన ఆలోచనతో అమెరికాలో ఉండే తెలుగు ప్రవాసీల సంఘం 'టెల్సా'ను సంప్రదించాడు. సహాయం కోసం అడగ్గానే ప్రవాసీలు స్పందించి సహాయం చేశారు.
టెల్సా దాతృత్వం..పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ