జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగడి బజార్కి తీసుకొచ్చారు. అనంతరం వాటన్నిటినీ ఒక్క చోట చేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు కోలాటాలు ఆడారు. డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యం చేశారు.
జగిత్యాలలో ఘనంగా పూలపండగ వేడుకలు - పూలపండగ వేడుకలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు వైభవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
జగిత్యాలలో ఘనంగా పూలపండగ వేడుకలు