జగిత్యాల బ్రాండ్ పేరుతో మామిడిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు జి.లక్ష్మిబాయి తెలిపారు. జిల్లా కేంద్రంలో త్వరలోనే పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ మేరకు జిల్లాలోని మామిడి మార్కెట్ యార్డులోని పలు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
'జిల్లాలో త్వరలోనే పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తాం' - జగిత్యాల జిల్లా తాజా సమాచారం
జగిత్యాలలో త్వరలోనే పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు జి. లక్ష్మిబాయి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మామిడి మార్కెట్ యార్డును ఆమె పరిశీలించారు.
'జిల్లాలో త్వరలోనే పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తాం'
జిల్లాలోని మామిడి మార్కెట్ సమస్యలపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, మార్కెట్ కమిటి ఛైర్మన్ దామోదర్‌రావుతో లక్ష్మీబాయి చర్చించారు. మార్కెట్ యార్డు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, పలువురు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'టీవీ ఉంటే రేషన్ కార్డ్ కట్'... నిజమెంత?