తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా రథోత్సవం - రథోత్సవం

శివనామస్మరణతో జగిత్యాల జిల్లా మల్లాపూర్​ సోమేశ్వరాలయం మారుమోగింది. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

రథం ఊరేగింపు

By

Published : Mar 6, 2019, 12:14 PM IST

వైభవంగా రథోత్సవం

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ సోమేశ్వరకొండపై మహాశివరాత్రి వేడుకలు ఐదు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. సోమవారం రాత్రి లింగోద్భవ పూజలు వైభవంగా జరిపారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి స్వామి వారి రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివమాల ధరించిన స్వాములతో పాటు వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివనామస్మరణతో రథాన్ని ఊరేగించారు. భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

ఇవీ చూడండి:సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details