తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథ యువతికి పెళ్లి చేసిన స్నేహితులు!

తల్లిదండ్రులు రెండేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి పోయారు. అప్పటి నుంచి అనాథగా మిగిలిన ఆ యువతికి పెళ్లీడు వచ్చింది. అందరూ ఉన్నా.. పెళ్లి చేసి అత్తింటికి పంపాలంటే లక్షలు ఖర్చు పెట్టక తప్పని రోజులివి. అలాంటిది..ఎవరూ లేని ఆ అనాథ యువతికి స్నేహాలయ యూత్​ తోడుగా నిలిచి.. పెళ్లి చేసి అత్తారింటికి పంపంది.

Sneha Youth Does Orphan Girl Marriage
అనాథ యువతికి పెళ్లి చేసిన స్నేహితులు!

By

Published : May 15, 2020, 5:50 PM IST

జంబుక స్వప్నది.. జగిత్యాల జిల్లా మల్లాపూర్​ మండలం గుండంపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఎవరూ లేకపోయినా.. ఆత్మస్థైర్యంతో బతికింది. కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుంది. ఏం ఆగినా.. కాలం ఆగదు కదా! స్వప్నకు పెళ్లీడు వచ్చింది. పెళ్లి కుదిరింది. పెళ్లి సంబంధం అయితే కుదిరింది కానీ.. పెళ్లి చేసే పెద్దలెవరు?

ఈ సమయంలోనే.. స్నేహాలయ యూత్​ సభ్యులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. మానవత్వం.. మంచితనం అనే మాటలకు జీవం పోశారు. పెళ్లికి కావాల్సిన ఖర్చును అందరూ కలిసి జమచేశారు. పెళ్లి ఖర్చు, ఇతిర వస్తువులు, లాంఛనాలు, భోజనాలు అన్నీ సిద్ధం చేశారు. బంధువులకు ఏ లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. కరోనా వైరస్​ వ్యాపించకుండా ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూనే.. స్వప్న పెళ్లి చేశారు. మాస్కులు, శానిటైజర్లు అన్నీ అందుబాటులో ఉంచారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పెళ్లికి చుట్టాలు, ఊరి ప్రజలు అందరూ హాజరై వధూవరులను పెద్ద మనసుతో ఆశీర్వదించారు. భౌతిక దూరం పాటిస్తూ.. స్నేహాలయ యూవజన సంఘం చేసిన మంచిపని గురించి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. అమ్మానాన్నల స్థానంలో నిలబడి తన పెళ్లి చేసిన స్నేహాలయ యూత్​ సభ్యులే.. నాకు ఆత్మబంధువులు అంటూ స్వప్న కన్నీళ్లు పెట్టుకున్నది.

ఇదీ చూడండి:ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details