జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ప్రభుత్వ భూముల పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో ఇంటికి ఆరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించిన వారికే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ.. హరిత, స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
చెట్లను సంరక్షించిన వారికే సంక్షేమపథకాలు: ఎర్రబెల్లి
జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ప్రభుత్వ భూముల పట్టా సర్టిఫికెట్లను అందజేశారు.
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి: ఎర్రబెల్లి