జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, రాజారాం గ్రామాల్లోని ఇసుక డంపులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గోదావరి తీరం, పలువురి ఇళ్ల వెనక ఉన్న 70 డంపులను గుర్తించి సీజ్ చేశారు. 70 ఇసుక డంపుల్లో 2100ట్రాక్టర్ల ఇసుక ఉంటుందని ధర్మపురి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలుంటాయన్నారు.
ధర్మపురిలో ఇసుక డంపుల సీజ్ - sand
అక్రమంగా ఇసుక నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో జగిత్యాల జిల్లా జైన, రాజారాంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. 70 ఇసుక డంపులను సీజ్ చేశారు.
ఇసుక డంపులు