నాడు తెలంగాణ ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తే అనవసరమైన రాద్ధాంతం చేసి చీరలను కాలబెట్టిన కాంగ్రెస్ నేతలు నేడు కనిపించకుండా పోయారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పంపిణీ చేశారు. మెట్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మహిళలకు గౌరవప్రదంగా బతుకమ్మ చీరలు అందిస్తూ అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా కేసీఆర్ మారాడని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
'చీరలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలెక్కడ?' - pampini
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ బతుకమ్మ చీరలు అందిస్తూ అందరి ఇంట్లో పెద్ద కొడుకుగా మారాడని ఎమ్మెల్యే అభివర్ణించారు.
'చీరలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలెక్కడ?'
TAGGED:
pampini