తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష - proffecer

జగిత్యాల జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటి పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష

By

Published : Jul 27, 2019, 7:43 PM IST

జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. పంటలు ఆలస్యం నేపథ్యంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. వరినార్లు పోసుకునే సమయం ముగిసిందని.. స్వల్పకాలిక పంటలు మాత్రమే వేసుకునే అవకాశం ఉందని తెలిపారు. రైతులు, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించి పంటల సాగు చేపట్టాలని ఆయన సూచించారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష

ABOUT THE AUTHOR

...view details