మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ జరిగింది. గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు, 20 నిరుపేద కుటుంబాలకు 100 కిలోల బియ్యాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిత్యావరసరాల పంపిణీ
లాక్డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఫలితంగా పనులు లేక చాలా పేదలు నానా అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు పలు సేవా సంఘాలు ముందుకొచ్చి ఆపన్నహస్తం అందిస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్
రానున్న రోజుల్లో మరిన్ని నిరుపేద కుటుంబాలను గుర్తించి.. వారికి కూడా నిత్యావసర సరుకులను అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.
ఇవీ చూడండి:34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్