జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో అర్ధరాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. మేడిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీగా వరద రావడం వల్ల ధాన్యం నీళ్లపాలయింది. కొంత ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.
ఈదురు గాలులతో వర్షం.. తడిసిన ధాన్యం - Stained grain in jagityala district
కష్టపడి పండించిన పంట వానపాలైంది. అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది.
ఈదురు గాలులతో వర్షం.. తడిసిన ధాన్యం
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రెండు నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'