జగిత్యాల జిల్లాలో సర్పంచులు, ఉప సర్పంచుల ఉమ్మడి చెక్‌పవర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ ఏడాది పిబ్రవరి 2న పదవీ బాధ్యతలు తీసుకున్న సర్పంచులు చెక్‌పవర్ వివాదం వల్ల అభివృద్ధి పనులు ముందడుగు పడలేదు. జిల్లాలో సర్పంచులు ఆందోళన చేస్తుంటే మరో వైపు ఉమ్మడి చెక్‌పవర్ కొనసాగించాలని ఉప సర్పంచులు సైతం వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి చెక్‌పవర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే గ్రామాల్లో పాలన మరింత కుంటుపడే అవకాశం ఉందన్నారు సర్పంచ్ సంఘం నేతలు.
జాయింట్ చెక్‌పవర్‌ను తొలగించాలని సర్పంచుల ఆందోళన
జగిత్యాలలో ఆందోళన నిర్వహిస్తున్న సర్పంచుల తరపున ఆ సంఘం రాష్ట్ర నేత భూమన్న యాదవ్ హాజరై ప్రజా వాణిలో వినతి పత్రం అందజేశారు. జాయింట్ చెక్‌పవర్ తొలగించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజావాణిలో వినతి పత్రం అందజేసిన సర్పంచులు