తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఎన్నికలు ముగిసే వరకు తనిఖీలు నిర్వహిస్తాం"

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికలు ముగిసేవరకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మెట్​పల్లిలో పోలీసుల తనిఖీలు

By

Published : Apr 4, 2019, 1:02 PM IST

మెట్​పల్లిలో పోలీసుల తనిఖీలు
పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసేవారికి అడ్డుకట్ట వేసేందుకు జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లలో వాహనాలు, సినిమా థియేటర్లు, ఆర్టీసీ బస్టాండ్​ వద్ద సోదాలు నిర్వహించారు.

ప్రలోభాలకు లొంగకండి:
అనుమానాస్పదంగా కన్పించినవారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని మెట్​పల్లి ఎస్సై కిరణ్​కుమార్​ తెలిపారు.

అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి?

ABOUT THE AUTHOR

...view details