జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన కనుకుంట్ల కిషన్ అనే రైతుకు రెండున్నరెకరాల భూమి ఉంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగొచ్చేసరికి తన భూమిని అతని సోదరుడి పేరుపై పట్టా మార్పిడి చేశారు. విషయం తెలుసుకున్న కిషన్ భూమిని తన పేరు మీదకు మార్చాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడం వల్ల ఈ రోజు ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై విచారణ జరిపించి రైతుకు న్యాయం జరిపిస్తామని కిషన్‌కు జేసీ రాజేశం హామీ ఇచ్చారు.
ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం - FARER
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చేసరికి తన భూమిని వేరొకరి పేరుపై పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. జగిత్యాల ప్రజావాణిలో జేసీ రాజేశం ముందు ఈ ఘటన జరిగింది.
ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం