తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల గోస కనిపించడం లేదా: ఎంపీ అర్వింద్​ - తెలంగాణ వార్తలు

విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు అంటూ గొప్పలు చెప్పుకునే వారికి తెలంగాణ రైతుల గోస కనబడటం లేదా అంటూ నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలో పర్యటించారు.

arvind
అర్వింద్​

By

Published : Mar 31, 2021, 7:14 PM IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలో పర్యటించారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని ఈనెల 24న చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లగా.. అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో గాయపడిన చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డిని పరామర్శించారు.

అసెంబ్లీ వద్ద రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. బాధలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్​ చేయడం దారుణమన్నారు. చెరుకు ఫ్యాక్టరీలో 49 శాతం వాటా ఉన్నరాష్ట్ర ప్రభుత్వం దాన్ని తెరవాలన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు అంటూ గొప్పలు చెప్పుకునే వారికి తెలంగాణ రైతుల గోస కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల రిలీవ్‌కు జగన్‌ అంగీకారం

ABOUT THE AUTHOR

...view details