తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పట్టణ, పల్లెల్లో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే కొందరు ఆ మొక్కలు అడ్డుగా ఉన్నాయని తొలగిస్తున్నారు. అలాంటి వారిపై జగిత్యాల మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
హరితహారం మొక్కను తొలగించిన వ్యక్తికి జరిమానా - జగిత్యాల జిల్లాలో మొక్కను తొలగించిన వ్యక్తికి జరిమానా
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. అడ్డుగా ఉన్నాయని మొక్కలను తొలగిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అలాంటి వారిని ఉపేక్షించడంలేదు. మొక్కలు తొలగిస్తున్న వారిపట్ల చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
హరితహారం మొక్కను తొలగించిన వ్యక్తికి జరిమానా
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెలో మహేశ్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో ఓ మొక్కను తొలగించాడు. ఎలాంటి అనుమతి లేకుండా మొక్కను తొలగించినందుకు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆదేశాలతో సదరు వ్యక్తికి రూ. 3 వేల జరిమానా విధించారు. పట్టణంలో మొక్కలను కాపాడాలని, తొలగిస్తే జరిమనాలు విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.