తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్: ఆకలితో అల్లాడుతోన్న మూగజీవాలు - కొండగట్టు ఆలయం

లాక్​డౌన్ ప్రభావం​ మానవాళి మీదే కాకా.. మూగజీవాలపైనా తీవ్రంగా పడింది. కొండగట్టులో వందల కొద్ది ఉండే కోతులు.. రోజుల కొద్ది తిండి దొరక్క నీరసించిపోతున్నాయి. ప్రసాదం ఇచ్చే భక్తులు కరవై.. ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి.

lock down effect on monkeys
మూగజీవాలపై లాక్​డౌన్ ప్రభావం

By

Published : May 24, 2021, 7:24 PM IST

Updated : May 24, 2021, 7:38 PM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో.. లాక్ డౌన్ వేళ మూగ‌జీవాలకు తినేందుకు ఆహారం దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఆలయం మూసివేసినందున.. కొండపైకి భక్తులెవరూ రావడం లేదు. ఆహారం అందిచేవారు లేకపోవటంతో.. కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి. ఎండలో నీరసించిపోయిన పలు వానరాలు.. మృత్యువాత పడ్డాయి.

నీరసించిపోతోన్న మూగజీవాలు
ఆకలితో అల్లాడుతోన్న వానరాలు
ఆదుకుంటోన్న జంతు ప్రేమికులు

ఆలయ పరిసర ప్రాంతాల్లో.. కనీసం తాగునీటి వసతి కూడా అందుబాటులో లేకపోవడం వల్లే వానరాలు చనిపోయాయని స్థానికులు వాపోతున్నారు. జంతు ప్రేమికులు అప్పడప్పుడు వెళ్లి పండ్లు అందిస్తున్నప్పటికి.. అవి వాటికి ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు. ప్రభుత్వమే మూగజీవాలను కాపాడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:చేపల చెరువులో కొండ చిలువ కలకలం..!

Last Updated : May 24, 2021, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details