ధరణితో మరిన్ని సమస్యలు పెరిగాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోవడమే అన్ని సమస్యలకు కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని భూమి సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణితో మరిన్ని సమస్యలు పెరిగాయన్నారు. తహసీల్దార్, ఆర్డీవో హక్కులను వెంటనే తొలగించాలన్నారు.
ధరణితో సమస్యలు మరిన్ని పెరిగాయి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ధరణితో సమస్యలు మరిన్ని పెరిగాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోవడమే అన్ని సమస్యలకు కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించే లక్ష్యంతో మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ధరణితో సమస్యలు అధికమయ్యాయన్నారు.
తప్పులను సవరించే అధికారం రెవెన్యూ వ్యవస్థ నుంచి తొలగించడంతో పాటు.. ధరణితో ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ తొలగించడమే అన్ని సమస్యలకు మూలమని జీవన్‌రెడ్డి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే కనీసం ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా తెలియడం లేదని వాపోయారు. ప్రస్తుతం ఏది పరిశీలిస్తున్నారో.. ఏది తొలగిస్తున్నారో కూడా తెలియకుండా తెర చాటు చేర్పులు మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: