జగిత్యాల జిల్లా తిమ్మాయిపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గోదావరి జలాల కేటాయింపుల్లో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
''గోదావరి నది జలాల కేటాయింపుల్లో తెరాస ప్రభుత్వం వివక్షకు పాల్పడుతోంది. నదీ పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు... మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ప్రచార ఆర్భాటం కోసం కొండపోచమ్మ సాగర్‌కు సాగు నీటిని తరలిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తెలంగాణ వివక్షకు గురైంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది.''