సీఎం కేసీఆర్ ఒప్పంద ఉద్యోగులను తొలగిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఉద్యానవన శాఖలో మండలంలో పనిచేస్తున్న 500 మంది విస్తీరణాధికారులను తొలగించారని చెప్పారు.
తెలంగాణలో రాచరిక పాలన: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - జగిత్యాల జిల్లా వార్తలు
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. వారిని తొలగిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో రాచరిక పాలన: జీవన్ రెడ్డి
మిషన్ భగీరథలో 10 వేల మందిని తొలగించారన్నారు. ఉపాధి పనులను పర్యవేక్షించే 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం నాలుగు నెలలుగా పక్కకు పెట్టడం మంచికాదన్నారు. పక్క రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే ప్రక్రియ చేపట్టిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. తొలగించిన ఒప్పంద ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి