MLC Jeevan Reddy on Telangana Budget: రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించేలా రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ అధికారంలోకి వచ్చిన తెరాస సర్కార్... ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో తన చిత్తశుద్ధిని చాటుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు 'మన ఊరు-మన బడి' కార్యక్రమం తెచ్చారని.. సిబ్బంది నియామకం చేపట్టకుండా ఎన్ని పథకాలు తెచ్చినా ఉపయోగం ఉండదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ విషయం మరిచింది
"కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని తెరాస చెప్పింది. అధికారంలోకి వచ్చాక విద్యారంగాభివృద్ధిని మరిచింది. ఈ ఎనిమిదేళ్లలో పాఠశాలల్లో నియామకం ఎన్ని సార్లు చేపట్టారు.? సిబ్బంది లేకుండా ఎన్ని పథకాలు తెచ్చినా ఉపయోగం ఉండదు. రాబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి." -జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ