జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం కార్యాలయం ముందు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మేడే సందర్భంగా కార్మిక సంఘం జెండా ఎగురవేశారు. కరోనాను నివారించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వల్లనే అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అన్నారు. మేడే ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మృతికి ఎమ్మెల్యే, కార్మికులు సంతాపం తెలిపి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కార్మికసంఘం జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ - Mla Vidyasagar Rao In May Day Celebrations
జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మేడే సందర్భంగా కార్మిక సంఘం జెండా ఎగురవేశారు.
కార్మికసంఘం జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్
TAGGED:
mla