జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గ్రామాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నాచుపల్లి, డబ్బు తిమ్మయ్యపల్లి, హిమ్మత్ రావుపేట, తిర్మలాపూర్, సూరంపేట, కోనాపూర్, దమ్మయ్యపేట, రామకిష్టపూర్, చెప్యాల, అప్పారావుపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - MLA Sunke Ravishankar latest news
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తేమ , ధాన్యం నాణ్యతపై శ్రద్ధ చూపి మంచి ధర పొందాలని సూచించారు.
- ఇవీ చూడండి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ