జగిత్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. రాజీవ్‌గాంధీ మామిడి మార్కెట్‌లో రూ.5 కోట్ల 20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతులకు అన్ని వసతులు ఉండే విధంగా మామిడి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ సీజన్‌కు మార్కెట్ అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు, మామిడి వ్యాపారులు కార్యక్రమంలో హాజరయ్యారు.
రూ.5.20 కోట్లతో మామిడి మార్కెట్ అభివృద్ధి పనులు - JAGITYAL NEWS IN TELUGU
జగిత్యాలలోని మామిడి మార్కెట్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రారంభించారు. రూ.5 కోట్ల 20 లక్షలతో ఈ పనులు చేస్తున్నట్లు వివరించారు.
MLA SANJAY KUMAR STARTED DEVELOPMENT PROGRAMS IN JAGITYAL