తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు: ఎమ్మెల్యే రవిశంకర్​ - ప్రతిపక్షాలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుంకె

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రారంభించారు. కేసీఆర్​ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు చూడాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రాంతమే మరో కోనసీమను తలపిస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

mla ravishanker fire on opposition at lift irrigation inauguration at kodimyala
అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు: ఎమ్మెల్యే రవిశంకర్​

By

Published : Aug 11, 2020, 4:29 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. పోతారం చెరువుపై భారీ పంపులను ప్రారంభించి దిగువనున్న శ్యామల చెరువులోకి నీటిని విడుదల చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఈ ఎత్తిపోతలేంటి.. నీళ్లేంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయని.. కేసీఆర్​ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వారు చూడాలని ఎమ్మెల్యే సూచించారు.

కొడిమ్యాల మండలంలోని సుమారు 17 వేల ఎకరాలకు ఎత్తిపోతల జలాలతో సాగునీరు అందనుంది. కేవలం పోతారం పంప్ హౌజ్​ కింద ఆరు చెరువులతో మూడు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనికోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రూ.1,735 కోట్లతో ఆరు పంప్​హౌజ్​లు, 110 కిలోమీటర్ల పైపులైన్, 45 కిలోమీటర్ల కాలువలు ఏర్పాటు చేశారు. ఎత్తిపోతల పథకంలో మిగతా పనులన్నీ పూర్తి కావటంతో తాజాగా పోతారం పంప్ హౌస్​ను ప్రారంభించారు. దశాబ్దాలుగా రైతులంతా ఎదురుచూసిన సాగునీటి స్వప్నం సాకారమైంది.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు: ఎమ్మెల్యే రవిశంకర్​

ఇవీచూడండి:వరదలతో మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details