ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఫిల్టర్ బెడ్లో 10 రోజుల క్రితం ఫిల్టర్ బెడ్ వద్ద గేటు వాల్ చెడిపోవడంతో మంచి నీరంతా మురుగు కాలువలో కలిసిపోతుంది. ప్రతిరోజు ఫిల్టర్ బెడ్లో భగీరథ నీటిని నింపిన తర్వాత గేట్ వాల్ బంద్ చేయడంతో చుక్క నీరు వృథాగా పోకుండా ఉండేది. ప్రస్తుతం రోజంతా భగీరథ నీరు వృథాగా పోతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
MISSION BHAGIRATHA: మురికి కాలువలోకి మిషన్ భగీరథ నీరు - మిషన్ భగీరథ నీరు వృథా
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. గత 10 రోజుల నుంచి శుద్ధినీరు మురికి కాలువలో కలుస్తుంది. గేట్ వాల్ చెడిపోవడంతో నీరు వృథా అవుతున్నా.. సంబంధిత అధికారు మాత్రం పట్టించుకోవడం లేదు.
మూడు నియోజకవర్గాలకు సరఫరా అయ్యే ప్రధాన పైప్‌లైన్ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడినుంచి కోరుట్ల జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే మెట్ పల్లి వద్ద ప్రతిరోజు ఫిల్టర్ బెడ్లో నీటిని నింపి ట్యాంకు నిండిన తర్వాత గేట్లు బంద్ చేయడంతో నీటి ఉధృతి కింది స్థాయి వరకు ఎక్కువగా ఉంటుంది. గేటు వాలుకు మరమ్మత్తు చేయక పోవడంతో నీరు వృథాగా పోతున్న పట్టించుకునే వారు లేకుండా పోయారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల