జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్... మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవి శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రులు గంగుల, కొప్పుల - jagityala latest news
జగిత్యాలలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్.. మహిళలకు బతుకమ్మ చీరలు పంచారు. కరోనా దృష్ట్యా... లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వచ్చి చీరలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ministers distributed bathukamma sarees in jagityala
ఈ సందర్భంగా మహిళలకు మంత్రులు, ఎమ్మెల్యేలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి చీరలను పంపిణీ చేస్తారని మంత్రులు పేర్కొన్నారు.