జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణదాసు ఆశ్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లు తదితర విషయాలపై చర్చించారు. జిల్లాలో అందరి సహకారంతో కరోనా కట్టడి పూర్తి స్థాయిలో జరిగిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. స్థానికంగా హమాలీలను ఏర్పాటు చేసుకుని ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కొప్పుల సమీక్ష - corona virus latest news
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నారాయణదాసు ఆశ్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లతో పాటు తదితర విషయాలపై చర్చించారు.
కరోోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కొప్పుల సమీక్ష