తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2020, 2:37 PM IST

ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం కట్టాలి'

జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

minister koppula eeshwar participated in haritha haaram in jagityal
'పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం కట్టాలి'

హరితహారం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఉపాధ్యాయ సంఘ భవనంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మొక్కలు నాటారు. ఉపాధ్యాయులతో కలిసి హరితహారంలో పాల్గొన్న మంత్రి... ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రితోపాటు జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details